in

rakul preet singh gets a mega jackpot?

టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న టైమ్ లోనే బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ చెప్పుకోదగ్గ హిట్ లేక అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ కి కాకుండా అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి. ప్రస్తుతం ఇండియన్2 సినిమాలో చేస్తున్న ఒక కీలక పాత్ర మినహా ఏ ఆఫర్లు లేవు ఈ ముద్దుగుమ్మకు. ఈ నేపథ్యంలో రకుల్ కి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్ గా రకుల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. బ్రూస్ లీ, ధృవ సినిమాల్లో కలిసి నటించినప్పటి నుండి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నాడట.

చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో సినిమా గురించి చాలా కాలంగా టాక్ ఉన్నప్పటికీ అఫీషియల్ అనౌన్సమెంట్ అయితే రాలేదు. ఈ సినిమాలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడని సమాచారం ఉంది. చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటించనుందని టాక్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రకుల్ ని త్రిష ప్లేస్ లో తీసుకుంటున్నారా లేక శర్వానంద్ కి హీరోయిన్ గా తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరి సరసన నటించిన రకుల్ కి అవకాశాలు లేని టైమ్ లో చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే లక్కీ అనే చెప్పాలి..!!

Miss Shetty Mr Polishetty!

crazy rumor: heroes worried about sreeleela’s craze