in

Prabhas to play Lord Shiva in manchu vishnu’s bhaktha Kannappa?

కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టు అయితే టాలీవుడ్ మంచు వారి కుటుంబం చాలా ప్రతిష్టాత్మకంగా ఓ సినిమాని అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అంటూ మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా “భక్త కన్నప్ప” అనే మాసివ్ సబ్జెక్టు ని చేస్తున్నట్టుగా తెలిపారు. కాగా ఈ చిత్రం కోసం ఏం చెప్పారో ఏం చూపించారో కానీ ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు అనే వార్తలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ప్రభాస్ కోసం గాను ఓ క్యామియో పాత్రని డిజైన్ చేయగా దానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు స్టార్ట్ కాగా..

ఈ వార్తలు ఇప్పుడు నిజమే అన్నట్టుగా మంచు విష్ణు కూడా రిప్లై ఇవ్వడం మరింత షాకింగ్ గా మారింది. దీనితో ఈ భారీ చిత్రంలో ప్రభాస్ కూడా ఉన్నాడు అనే వార్త అఫీషియల్ అని విష్ణు చెప్పకనే చెప్పేసాడు. అయితే ఇది మాత్రం చాలా మంది ఊహించని వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బహుశా ఆ పరమ మహాశివుని పాత్రలో కనిపిస్తాడని చెప్పొచ్చు. కాగా విష్ణు భక్త కన్నప్పగా నటించగా తన కోసం వచ్చే పరమేశ్వరుని పాత్ర కోసం వీరు సంప్రదించి ఉంటారు. మొత్తానికి అయితే ఇపుడు మంచు వారు తమ సినిమాకి కావాల్సిన పాన్ ఇండియా హైప్ ని మాత్రం తీసుకొచ్చేసారు..!!

crazy rumor: heroes worried about sreeleela’s craze

Jailer producer gifts 300 gold coins to crew members!