in

Comedian Ali shares good news about his elder daughter!

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌, హోస్ట్ అలీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈయ‌న.. బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో స్టార్ క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అలీ.. జుబేదా అనే ముస్లిం యువ‌తిని వివాహం చేసుకున్నారు.

ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే తాజాగా పెద్ద కూతురు ఫాతిమా త‌న తండ్రి అలీ క‌ల నెర‌వేర్చింది. ఫాతిమా తన డాక్టర్ చదువుని పూర్తి చేసి పట్టా అందుకుంది. దీనితో ఫాతిమా.. డాక్టర్ ఫాతిమాగా మారింది. దీంతో అలీ ఇంట సెలబ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఇక కూతురు డాక్టర్ కావడంతో.. ఈ విష‌యాన్ని అలీ సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

`ఫాతిమా డాక్టర్ అయింది. తమ కుటుంబంలో ఆమెనే మొదటి డాక్టర్, నా కోరిక తీరింది` అంటూ అలీ కూతురుతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే అలీ కూతురు ఫాతిమాకు నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా, అలీ భార్య జుబేదా ఈ మధ్యే యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వెరైటీ వీడియోల‌తో ఆమె అక్క‌డ భారీగా ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటూ పోతోంది.

beast!

Katrina Kaif’s latest look sparks pregnancy rumours!