
చోట.కే.నాయుడు తెలుగు సినిమా రంగం లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, వారి పేరు వెనుక ఉన్న కథ గురించి వారినే అడుగుదాము అంటే , వీజీ గ చెప్పే రకం కాదు అయన అందుకే మనం సొంత గ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.కెరీర్ ప్రారంభ దశలో ట్.వీ.సీరియల్ కి ఫోటోగ్రఫీ చేస్తూ లేడీ నిర్మాత కు ఐ లవ్ యు చెప్పిన గుండెలు తీసిన బంటు ఇతను.బుర్రకి ఏది తోచితే అది మాట్లాడే నైజం,అదే” చోట ఇజమ్” గ అందరి మన్నన లతో తెలుగు సినిమా పరిశ్రమ లో ముందుకు వెళుతున్న సింపుల్ అండ్ టాలెంటెడ్ పర్సన్.ఈయన గారు టీ.వీ. సీరియల్ చేస్తున్నప్పుడు, ఛోటా గారు అర్జెంటు గ హైదరాబాద్ నుంచి మద్రాస్ వేళ్ళ వలసి వచ్చింది, అప్పట్లో మన ఛోటా గారి జేబులు చాల బరువు గ ఉండేవి, విషయం తెలుసుకున్న ఇందాక చెప్పిన లేడీ ప్రొడ్యూసర్ గారు, ఛోటా గారికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసారు, అప్పుడు ట్రావెల్ ఏజెంట్ పేరు అడిగితె ఛోటా అని చెప్పడానికి బదులు, ఛోటా. కే.నాయుడు అని చెప్పారట, అపోలో హాస్పిటల్స్ ప్రతాప్.సి.రెడ్డి రేంజ్ లో. ఎందుకంటే ఈ లేడీ ప్రొడ్యూసర్ గారి నాన్న గారికి ప్రతాప్.సి.రెడ్డి. గారికి స్నేహం ఉండటం వలన అనుకోకుండా ఆవిడ గారు ఛోటా గారి కి ఆ విధంగా నామకరణం చేసారు.అమ్మ ముద్దు గ ఛోటా అని పిలుచుకునే వారు, దానినే పేర్మనంట్ చేసి అసలు పెద్దలు పెట్టిన అయన తాత గారి పేరును అటక ఎక్కించేసారు.అడిగి అడగగానే అన్ని మాట్లాడే ఛోటా గారు ఆ పేరును ఎక్కడ బయట పెట్టరు. మనం కూడా బయటకు చెప్పడము ఎందుకు, అతను అసలే ……. . ఇంతకీ ఇంకొక ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈయన గారికి నామకరణం చేసిన లేడీ ప్రొడ్యూసర్ అయిన సీత దేవి గారికి ఐ లవ్ యు చెప్పి ఆ తరువాత ఆవిడానే తన జీవిత భాగస్వామి గ చేసుకున్న ధీ శాలి.ఛోటా.కే.నాయుడు జులై ౩వ తేదీ 1962 లో జన్మించారు, వారు ఇలాగే పది కాలాలు పాటు మంచి సినిమాటోగ్రాఫర్ గ కొనసాగాలని కోరుకుందాము.

