ఒక డిఫరెంట్ కాన్స్పెట్ , డిఫరెంట్ ట్రీట్మెంట్ తో వచ్చిన బిజినెస్ మేన్ లో డైనమిక్ డైరెక్టర్ పూరి ఈ సినిమాలో నువ్వు తప్పక పాడావల్సిందే అని పట్టుబట్టడంతో చాల ట్రై చేశాడు అంట! ‘Aamchi Mumbai apna adda’ సాంగ్ పాడమని , ఆ సినిమాలో సందర్భాను సారం వచ్చే సాంగ్ కావడం హీరోని ఒక రేంజిలో ఎలివేట్ చేసేందుకు వచ్చే సాంగ్ కాబట్టీ మహేష్ స్వయంగా పాడితే ఇంకా బాగా వర్క్ అవుట్ అవుతుందని పూరి భావించాడు అంట. మిగతా యూనిట్ సభ్యులు అందరూ అవును సార్ మీరు ఈపాట సినిమాకే హైలెట్ అవుతుంది పాడమని ఒత్తిడి తేవడంతో.. రికార్డింగ్ థియేటర్ లోకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పూరి తో కలసి అడుగుపెట్టిన మహేష్ బాబు ఆపాట పాడటానికి చాలా ట్రై చేశాడు అంట.