in

national crush rashmika signs Vampires Movie!

ర‌ష్మిక కెరీర్ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ సౌత్‌లోనే త‌న హ‌వా. యానిమ‌ల్‌ హిట్ట‌య్యాక బాలీవుడ్‌లోనూ రేంజ్ పెరిగింది. త‌న చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఇప్పుడు మ‌రో కొత్త సినిమా చేరింది. అందులోనూ హిందీ నుంచి. ఆయుష్మాన్ ఖురానా స‌ర‌స‌న ఓ సినిమా చేయ‌డానికి ర‌ష్మిక ఒప్పుకొంది. ఆదిత్య స‌త్పోద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయుష్మాన్ ఖురానా ఓ సినిమా చేస్తున్నారు. దినేష్ విజ‌న్ నిర్మాత‌. ఇదో హార‌ర్ సినిమా అని టాక్‌.

హార‌ర్ జోన‌ర్‌లో ర‌ష్మిక న‌టించ‌డం ఇదే తొలిసారి. జోన‌ర్ ప‌రంగా ఛేంజ్ ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే ర‌ష్మిక ఈ సినిమా ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. పైగా ఈ చిత్రానికి త‌క్కువ కాల్షీట్లు ఇస్తే స‌రిపోతుంద‌ని, పారితోషికం కూడా గ‌ట్టిగానే ముడుతోంద‌ని టాక్‌. ఈ చిత్రానికి ‘వాంపైర్ ఆఫ్ విజ‌య్‌న‌గ‌ర్‌’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్తుంది. మ‌రోవైపు పుష్ష 2 షూటింగ్ మంచి స్వింగ్ లో జ‌రుగుతోంది. ర‌ష్మిక వారం రోజులు కేటాయిస్తే త‌న పార్ట్ పూర్తి చేయొచ్చు..!!

businessman ku nijanga siggu yekkuve!

mega prince Varun Tej Having AI Love Story!