
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]కొ[/qodef_dropcaps] న్నేళ్ల క్రితం టాలీవుడ్ లొ ఫాన్స్ వార్ బాగా జరిగిన విషయం తెలిసిందే, మా హీరో నెంబర్ 1 ఆంటే కాదు మా హీరో నెంబర్ 1 అంటు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ రచ్చ రచ్చ చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, టాలీవుడ్ హీరోస్ మేమంతా ఒక్కటే అంటు మల్టీ స్టారర్ మూవీస్ తీయడం, ఒకరి సినిమా ఫంక్షన్ కి ఇంకొకరు చీఫ్ గెస్ట్ గ రావడం సాధారణం అయిపోయింది. మెగా ఇంక నందమూరి ఫాన్స్ మధ్య తరచు ఇదొక వివాదం ఉంటూనే ఉంటది, కానీ ఇప్పడు ఆ పరిస్థితి కనబడటం లేదు. దీనికి ఉదాహరణ రామ్ చరణ్ ఇంక జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న దోస్తీని చుస్తే అర్ధం అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ తానే ఒక సొంత ప్రొడక్షన్ మొదలుపెడ్తున్నట్టు సమాచారం, దీని పేరు భార్గవ హరి అని పెట్టాలనే ఆలోచనలు జూనియర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, కొడుకు పేరు భార్గవ్ ఇంక తండ్రి పేరు హరి రెండు కలిపి భార్గవ్ హరి ప్రొడక్షన్స్ దీని అర్ధం. టాలీవుడ్ హీరోస్ మధ్య ఇలాంటి మంచి సంబంధం ఇలానే కొనసాగాలని కోరుకుందాం.