తను బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో పార్టీలకు వెళ్ళవలసి వచ్చేదని అక్కడ తనను కొంతమంది గొడ్డు మాంసం తినమని ఫోర్స్ చేసేవారని ఆమె చెప్పింది. గొడ్డు మాసం తినడం తనకు ఇష్టం లేకపోయేదని వివరిస్తూ..బాలీవుడ్ లో ఉన్న రాజకీయాలు తనకు నచ్చలేదని, ఆ రాజకీయాలు చూసి విసిగిపోయి బాలీవుడ్ ను కావాలనే దూరం పెట్టానని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి నిజానికి సంవత్సరం గడుస్తుంది. అయితే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తరువాత ప్రియాంక మాటలు ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడిందని అప్పట్లో చర్చలు జరిగాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే ఒక ఫంక్షన్ లో ప్రియాంక చోప్రా వ్యాఖ్యలకు కారణమైన ఆ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మరియు ప్రియాంక చోప్రా కలివిడిగ ఉండటంతో మరోసారి ప్రియాంక చోప్రా గొడ్డు మాసం కాంట్రవర్సీ బయటకు వచ్చింది.