in

vijay devarakonda’s cameo in NTR’ devara?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. హైదరాబాద్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ సోలో సీన్స్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఇతర యాక్టర్లతో కూడా ఈ సీన్లో షూటింగ్ చేయబోతున్నారట. వి ఎఫ్ ఎక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందేమోనని

ఆలోచనతో కొరటాల ముందుగానే సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది..ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందని ఆ పాత్రను రహస్యంగా ఉంచడానికి మూవీ టీం ప్రయత్నిస్తున్నారట. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ పాత్రను నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక షూటింగ్ దశలోనే ప్రేక్షకులలో భారీ హైప్‌ సొంతం చేసుకున్న‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..!!

kgf beauty Srinidhi Shetty To Pair Up With Balakrishna?

beef controversy, priyanka chopra in the news again!