in

balayya’s heroine sonal shocking comments on movie rejections!

బాలకృష్ణతో వరుసగా లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాలు చేసింది. వీటిలో లెజెండ్ మినహా మిగిలిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో సోనాల్ కు నిరాశే మిగిలింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఎఫ్ 3 సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తమన్నాతో ప్రేమలో పడే అమ్మాయిగా గ్లామర్ ప్రధాన పాత్రలో కనిపించింది. ఇండస్ట్రీలోకి వచ్చిన పధ్నాలుగు ఏళ్లు పూర్తయినా స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయింది..

తన సినీ ప్రయాణంపై సోనాల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా పరిశ్రమలో అవకాశాలు, ప్రశంసల కంటే తిరస్కరణలు, అవమానాలే ఎక్కువగా ఎదురవుతాయని పేర్కొన్నది. ఓ సినిమా ఆఫర్ ను అందుకోవడానికి ఎన్నో అడ్డంకులను దాటుకోవాల్సివస్తుందని చెప్పింది. ఆడిషన్స్ చేసిన తర్వాత ఎన్నోసార్లు అవకాశాలు ఇవ్వకుండా తనను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.

ఇండస్ట్రీలో అందరూ మంచివాళ్లే ఉండరని అన్నది. ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా ఆత్మస్థైర్యం ఉండాలని చెప్పిందే. అప్పుడే ఈ సవాళ్లు ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడగలమని పేర్కొన్నది. సక్సెస్ లు ఉన్నవారి వెంట చాలా మంది ఉంటారని, వారిపైనే అందరి దృష్టి ఉంటుందని పేర్కొన్నది. కానీ ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు ఎవరూ వెంట ఉండరని చెప్పింది. ప్రస్తుతం నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

can sai pallavi get national award for ‘gargi’ from central?

DJ Tillu director Vimal Krishna walks out of the sequel?