తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన బాషా చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ చిత్రమో అందరికి తెలుసు. ” బాషా! మాణిక్ బాషా! ఒక్క సారి చెపితే వందసార్లు చెప్పినట్లు” అనే డైలాగు బాలయ్య బాబు నోటి వెంట పలికి ఉండి ఉంటె ఎలా ఉండేది ? ఈ ఇమాజినేషన్ ఏందబ్బా! అనుకోకండి, ఈ అరుదయిన అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు తృటిలో మిస్ అయ్యారు, ఎలాగో తెలుసా? సూపర్, డూపర్ హిట్ అయిన బాషా చిత్రాన్ని నిర్మాతలు తెలుగులోకి డబ్ చేయాలని అనుకున్నారు , దర్శకు డు సురేష్ కృష్ణ మాత్రం రీమేక్ చేస్తే బాగుంటుంది, ఇందులో బాలయ్య నటిస్తే బాగుంటుంది అనుకోని, దేవి శ్రీ థియేటర్ లో సినిమా స్పెషల్ షో వేసి తెలుగు ఇండస్ట్రీ లో వారిని ఆహ్వానించారు.
బాలయ్య బాబు కూడా ఈ సినిమా చూసారు కానీ బాడ్ లక్ ఏమిటంటే, మన తెలుగు వారికీ ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. సహజం గ బాలయ్య బాబు రీమక్స్ కి కొంచెం దూరంగా ఉంటారు, ఈ నేపధ్యం లో బాలయ్య బాబు ఈ అవకాశాన్ని లైట్ గ తీసుకున్నారు, కట్ చేస్తే తమిళ్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేసారు . బాలయ్య ఒప్పుకొని ఉండి ఉంటె, బాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది, ఆలా వచ్చి ఉంటె అది ఏ రేంజ్ లో ఉండేదో ఒక్క సారి ఊహించండి, ఆన్ బిలీవబుల్ కదూ? ఏది ఏమయినా, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు..