in

Mehreen pirzada ‘Sparks’ With Young Hero!

f2 త‌ర్వాత మెహ‌రీన్‌కు స‌క్సెస్‌లు లేవు. అందుకే సీక్వెల్‌తో మరోసారి ఆ విజయాన్ని రిపీట్ చేయాల‌నే ఉత్సాహంతో మెహ‌రీన్ ఉంది. తాజాగా తెలుగులో మ‌రో సినిమాకు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. స్పార్క్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆదివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమా ద్వారా హీరోగా విక్రాంత్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. అత‌డికి జోడీగా మెహ‌రీన్ కథానాయికగా న‌టించ‌బోతున్న‌ది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు.

ఈ చిత్రంతో అర‌వింద్ కుమార్ రవివర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్, సుకుమార్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేయడంతో పాటు రత్నవేలు వద్ద అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా అరవింద్ కుమార్ పనిచేశాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో అతడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు.

BALAYYA FANS MISSED A GOLDEN CHANCE!

Kajal shares first photo of baby son Neil, pens emotional note!