police arrested heroine kidnappers!
నటి పూర్ణను కిడ్నాప్ చేయాలనుకున్న ముఠా ప్రయత్నం వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో విఫలమైంది. కొచ్చి (కేరళ) పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే చెప్పిన దాని ప్రకారం, పూర్ణ (అసలు పేరు షామ్నా కాశిమ్)ను కిడ్నాప్ చేయడం ద్వారా ఆమె కుటుంబం నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించిన 12 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమయానికి పూర్ణ ఫిర్యాదు చేయడంతో తమ ప్లాన్‌ను అమలు చేయాలనుకున్న ఆ నిందితులను పోలీసులు అడ్డుకోగలిగారు. [...]











