in

superstar shocks his fans!

సూపర్ స్టార్ రజినీకాంత్ అసలు ఈ ఏడాది మొత్తం షూటింగ్ కి రానని చెప్పారట. 69 ఏళ్ల రజినికి ఉన్న అభిమానుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వయసులో కూడా ఆయన తన ఫాన్స్ కోసం సినిమాలలో డాన్సులు, ఫైట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.  కానీ ఈ మధ్య కొన్ని సడలింపులు ఇస్తుండటంతో మళ్ళీ మొదలవుతున్నాయి.

అయితే రజిని మాత్రం ఈ సంవత్సరం మొత్తం ఏ షూటింగ్ కి రాలేనని చెప్పారట!  ఎందుకంటే… రజని వయసు ప్రకారం కరోనా వైరస్ ఆయనకు చాలా ప్రమాదం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. రజిని ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనతో పాటుగా మీనా, కుష్బూ, కీర్తి సురేష్  కూడా నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు కానీ ఇప్పుడు రజిని తీసుకున్న నిర్ణయంతో అది అసాధ్యం. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది.

Vote for your favorite OTT platform to watch upcoming movies!

16 years for ‘yagnam’!