monal’s item song in bellamkonda’s ‘alludu adhurs’!
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, 'బిగ్ బాస్ 4' ఫేమ్ మోనాల్ గజ్జర్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. [...]











