in

payal rajput is doing a new web series!

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు ఓటిటిల వైపు మళ్లుతున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఓటిటిలే సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి కానీ ఓటిటిల వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు సినీతారలు. అటు సినిమాలు చేస్తున్నా ఇటు ఓటిటిలకు ఓకే చెప్పడం మాత్రం ఆపట్లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఉన్న మాక్సిమం హీరో హీరోయిన్స్ అంతా ఓటిటి బాట పట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా అదే బాటలోకి వెళ్తోంది పాయల్ రాజపుత్. యంగ్ డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ వెబ్ ఫిల్మ్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఆర్ఎక్స్100 తర్వాత అంతటి బలమైన క్యారెక్టర్ పాయల్ కి దొరకలేదు. అయితే ఈ వెబ్ ఫిల్మ్ ఆ లోటు తీర్చనుందట. నటనకు ఎమోషన్స్ పందించడానికి ఆస్కారం ఉందని పాయల్ పచ్చజెండా ఊపిందట. చూడాలి మరి ఓటిటి అయినా పాయల్ ని బిజీ యాక్ట్రెస్ చేస్తుందేమో..!!

ithara rangalaku kuda paakina ram gopal varma prabhavam!

Ranveer Singh is all praise for Mahesh after working with him!