Sonu Sood Becomes India’s Brand Ambassador For Special Olympics!
కరోనా మహమ్మారి మన దేశాన్ని ఎలా పట్టిపీడించిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించగా.. ఆ సమయంలో వలస కార్మికులు స్వస్థలాలకు చేర్చేందుకు నడుం బిగించాడు.. సినీ నటుడు సోనూసూద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు తోచిన సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ఆయన ఎన్నో రకాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేదనకుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన నేషనల్ రియల్ హీరోగా మారిపోయారు. [...]











