10. ILEANA
వై వి యస్ చౌదరి దర్శకత్వం లో వచ్చిన దేవదాసు చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కు అప్పుడు వయసు 18 ఏళ్ళ లోపే. ఎనర్జిటిక్ హీరో రామ్ కు జంటగా నటించి ఇలియానా అభిమానులను ఆకట్టుకుంది.ఆ తర్వాత మహేష్ బాబు తో జంటగా నటించి ‘పోకిరి’, ‘జల్సా’ సినిమాలతో హిట్స్ సంపాదించుకుంది..
09. SAYESHA SAIGAL
అక్కినేని అఖిల్ తో జంటగా ‘అఖిల్’ సినిమా తో 17 ఏళ్లకే తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది సయాశా సైగల్..అఖిల్ డెబ్యూ సినిమా కావడంతో..సినిమా మీదే కాకుండా హీరో, హీరోయిన్ మీద కూడా బారి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్లాప్ అయినా అఖిల్ ఇండస్ట్రీ లో ఇంక బిజీ గ మారాడు కానీ సాయశా జాడ లేకుండాపోయింది..
08. NANDITA RAJ
నీకు నాకు డాష్ డాష్’ చిత్రం తో పరిచయం అయినా నందిత కు అప్పట్లో 17 ఏళ్ళు మాత్రమే..ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ‘ ప్రేమ కథ చిత్రం’..దీనికి ఫిలిం ఫెయిర్ అవార్డు కూడా రావడం విశేషం..ఈ విశాఖపట్నం అమ్మాయి ఇంక మంచి తెలుగు సినిమాలు చేసి అలరిస్తుందని ఆశిద్దాం.
07. SWETHA BASU
వరుణ్ సందేశ్ తో జంటగా ‘కొత్త బంగారు లోకం’ చిత్రం తో 17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్..మంచి ఎంట్రీ ఇచ్చిన..ఈ బ్యూటీ కు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం రాలేదు..పోటీ ఎక్కువ అవ్వడంతో క్రమంగా తెలుగు ఇండస్ట్రీ కు దూరం అయిపోయింది శ్వేతా బసు.
06. KRITI SHETTY
రీసెంట్ గ రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాలో నటించింది. 17 ఏళ్లకే హీరోయిన్ గ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది..ప్రస్తుతం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గ మారింది ఈ ఉప్పెన బ్యూటీ..ఒక్క సినిమాతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనే చెప్పాలి..తన స్పీడ్ చూస్తుంటే తొందర్లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం..
05. AVIKA GOR
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో అభిమానులను సంపాదించుకున్న అవికా గోర్ 16 ఏళ్లకే ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం తో హీరోయిన్ గా మారిపోయింది..మంచి సినిమాలతో ఇక్కడ పాగా వేసింది ఈ చిన్నది..నార్త్ నుండి వచ్చిన కూడా తెలుగు వాళ్ళకి త్వరగానే బాగా దగ్గరైంది అవికా..తన చేతిలో ప్రస్తుతం చాల తెలుగు సినిమాలు ఉన్నాయ్..
04. HANSIKA
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘దేశముదురు’ చిత్రం తో హీరోయిన్ గా 16 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది హన్సిక.ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ తెచ్చింది..ఆ తరువాత హన్సిక కొన్నేళ్లు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ దక్కించుకుంది..
03. LAXMI RAAI
కేవలం 15 ఏళ్లకే ‘కాంచన మాల కేబుల్ టీవీ’ చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లక్ష్మి రాయి.ఈ సినిమాలో ఆమె శ్రీకాంత్ తో జంటగా నటించింది. మంచి నటన..చూడడానికి కావాల్సిన అందం..ఈ రెండు ఈ భామ సొంతం..ప్రస్తుతం ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనదైన శైలిలో ఇండస్ట్రీ లో దూసుకపోతుంది లక్ష్మి రాయి.
02. THAMANNA
శ్రీ చిత్రంలో మంచు మనోజ్ తో జంటగా నటించి తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది తమన్నా.అప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు మాత్రమే. శ్రీ చిత్రంతో అంతగా ఆకట్టుకోకపోయిన తర్వాత శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీ డేస్ తమన్నా కు తెలుగులో మంచి బ్రేక్ తీసుకొచ్చిందని చెప్పచు..
01. CHARMI
15 ఏళ్లకే భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘నీతోడు కావాలి’ అనే చిత్రం తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హాట్ బ్యూటీ ఛార్మి..దాదాపు ఒక దశాబ్దం పాటు ఇండస్ట్రీ లో ఛార్మి తన హావ కొనసాగించింది..ప్రస్తుతం రూట్ మార్చేసిన ఈ భామ డైరెక్టర్ పూరితో కలిసి సినిమా ప్రొడక్షన్ మొదలు పెట్టింది.