in

poorna interesting comments about nayanthara!

టు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూనే.. అటు అడపాదడపా సినిమాలు చేస్తూంది పూర్ణ. ప్రస్తుతం డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించిన సుందరి సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇందులో హీరోగా బుల్లితెర నటుడు అర్జున్ అంబటి నటించారు. రిజ్వాన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 13 విడుదల కానుంది. ఈ సందర్భాంగా.. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూర్ణ మాట్లాడుతూ.. సుందరి సినిమాలో నేను చేసినది స్టార్ హీరోయిన్స్ స్థాయివారు చేసే పాత్ర. నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు.

కానీ నా మీద నమ్మకంతో దర్శక – నిర్మాతలు ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు. నాకు నయనతార స్పూర్తి. ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించాలని ఉందన్నారు. అనంతరం చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. సుందరి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశాం. మా సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతుందన్నారు. ఎదురుగా ఓ మనిషి ఉంటే సరిగ్గా మాట్లాడటానికి భయపడే ఓ అమ్మాయి అతిగా స్పందిస్తే ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా కథ అన్నారు కల్యాణ్‌ జి గోగన.

nivetha pethuraj hot and glamorous!

Ram Pothineni to romance Akshara Gowda!