in

prabhas creates a new record!

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్‌కి రికార్డులు చాలా కామ‌న్‌గా మారాయి. బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు త‌న పేరిట మ‌రిన్ని రికార్డులు లిఖించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఖాతాలో రాధే శ్యామ్, స‌లార్, ఆది పురుష్‌, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఉన్నాయి. రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ప్యాచ్ వ‌ర్క్ మిగిలి ఉంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు కృషి చేస్తున్నాడు ప్ర‌భాస్.

ఇక బాలీవుడ్ దర్శకుడ్ ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ 50 శాతం షూటింగ్ పూర్తి అవ్వగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది . వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని అనుకుంటున్నారు. ఇక స‌లార్ విష‌యానికి వ‌స్తే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే వారం నుండి హైద‌రాబాద్‌లో తదుప‌రి షెడ్యూల్ జ‌రుపుకోనుంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సైన్ ఫిక్ష‌న్ మూవీని కూడా ఇప్ప‌టికే స్టార్ట్ చేశాడు ప్ర‌భాస్. మొత్తానికి ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లి ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. స్టార్ హీరోల‌లో ఒకే సారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లిన ఘ‌న‌త ప్ర‌భాస్‌దే అని అంటున్నారు.

Kareena gets Pooja Hegde’s support over her fee hike to play Sita!

nivetha pethuraj hot and glamorous!