actress Trisha Krishnan is quitting films?
తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె వార్తల్లో నిలుస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నటుడు విజయ్ వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి రావడం, వీరిద్దరూ కలిసి బహిరంగంగా ఒక వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో త్రిష నటనకు స్వస్తి [...]











