
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. ‘SVC63’ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం మేకర్స్ అన్వేషణలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ లేదా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నాలలో ఒకరిని ప్రతినాయకుడిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా, గట్టి పోటీ ఇచ్చే నటుడిని విలన్ పాత్రకు ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే కాస్టింగ్ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా తగిన సమయం తీసుకుంటున్నారు. ఫహద్ ఫాసిల్ లేదా అక్షయ్ ఖన్నాలలో ఎవరైతే సల్మాన్ నెమెసిస్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతారో అని చర్చిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఇప్పటికే ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ఎంపికయ్యారు..!!

