దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రముఖ కథానాయిక అనుష్క శెట్టి ఓ చిత్రంలో నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఓ విభిన్న కుటుంబ కథా చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క శెట్టి ‘సైజ్ జీరో’ చిత్రంలో కనిపించినట్లుగా బొద్దుగా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ మేరకు దర్శకుడు మహేష్.పి. సూచనల మేరకు అనుష్క తన శరీరాకృతిని మార్చుకుంటున్నారని..
ఇందుకోసం ప్రస్తుతం ఆమె బరువు పెరిగే విధంగా డైట్‌ను తీసుకుంటున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. అయితే అనుష్క మరోసారి బొద్దుగా కనిపించడం ఆమె అభిమానులకు కాస్త ఇబ్బందిగా ఉందట. అయితే పాత్ర కోసం, సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధపడే నటీనటులు అరుదుగా వుంటారు అందులో అనుష్క ముందువరుసలో ఉంటారు. గతంలో కూడా సైజ్‌జీరో కోసం దాదాపుగా 20 కేజీల బరువు పెరిగారు అనుష్క. అయితే ఇక ఈ తాజా చిత్రంపై, ఆమె పాత్రపై వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే..