F3 మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా హీరోయిన్ తమన్నా కనబడలేదు. దీంతో అనిల్ రావిపూడి కి తమన్నా కి మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు షికార్లు చేశాయి. అన్ని ప్రమోషన్ కార్యక్రమాలలో హీరోలు వరుణ్ తేజ్, వెంకటేష్.. మరో హీరోయిన్ మెహరీన్ .. మాత్రమే కనబడ్డారు. కానీ ఆఖరి క్షణంలో మూవీ రేపు రిలీజ్ అవుతున్న తరుణంలో కొద్దోగొప్పో ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా రావటం జరిగింది.. ఇదంతా పక్కన పెడితే ఈ గొడవ గురించి ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తమన్నాతో గొడవలు అని వస్తున్న వార్తలలో పెద్ద వాస్తవం లేదు. ఎక్కడా కూడా ఒకరిపై మరొకరు బాగా తిట్టుకున్న అంత విమర్శలు కూడా చేసుకోలేదు.
కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో రెండు రోజులు ఇద్దరి మధ్య మంచి వేడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో నేనే కలుగజేసుకుని మాట్లాడాను. షూటింగ్ కొద్దిగా ఆలస్యం కావడంతో పాటు.. హీరోయిన్ లు జిమ్ కి వెళ్లాలి కాబట్టి.. కొద్దిగా మాటా మాటా పెరిగింది. ఆ రెండు రోజులు తప్ప .. తర్వాత ఇద్దరం కలిసి పోయాం. అయితే తమన్నా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జాయిన్ కాకపోవడానికి ప్రధాన కారణం.. ఔట్ డోర్ షూట్ లో ఉంది. అంతేగాని గొడవల వల్ల ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో “F4” సినిమా ఉంటుందని కానీ హీరోయిన్ లు మారిపోతారని అనిల్ రావిపూడి తెలిపారు.