in

Sushanth Befitting Reply To Netizen Who Asked About Virginity!

ప్పటికే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన సుశాంత్ ఇప్పుడు రవితేజ నటిస్తోన్న ‘రావణాసుర’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సుశాంత్ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు మౌంటైన్స్ అంటే ఇష్టమా..? లేక బీచ్ లా..?’ అని అడగ్గా.. బీచ్ లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘పెళ్లి రోజు ఎప్పుడు..?’ అనే ప్రశ్నకు ఆలోచిస్తున్నట్లు ఎమోజీ షేర్ చేశారు. నెక్స్ట్ మూవీ గురించి అడగ్గా.. రవితేజ ‘రావణాసుర’ పోస్టర్ పెట్టారు.

ఓ నెటిజన్ మొబైల్ నెంబర్ అడగ్గా.. ‘ఇంకేంటి సంగతులు..?’ అంటూ రిప్లై ఇచ్చారు. రవితేజ గురించి చెప్పండి అనగా.. చాలా మంది వ్యక్తి ని బదులిచ్చారు. నాగచైతన్య, అఖిల్ లలో ఒకరిని ఎన్నుకోమని అడగ్గా.. ప్రశ్నే తప్పు అబ్బాయ్ అని కామెంట్ చేశారు. ఇదే సమయంలో ఓ నెటిజన్ ‘నువ్ వర్జినా..?’ అని ప్రశ్నించారు. దానికి సుశాంత్ ‘నేను నిప్పు’ అని అర్ధం వచ్చేలా దీపం ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం సుశాంత్ ‘MNT’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. జీ5లో ఈ సిరీస్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటివరకు MNT ఫుల్ ఫామ్ ను వెల్లడించలేదు.

Anil Ravipudi Opens Up On His Fight With Tamannaah!

SONALI BINDRE: did many UNWANTED ROLES to pay MY rent