in

pelli sandhadi girl sreeleela in pawan kalyan’s next?

తాజాగా తెలుగులో శ్రీలీల మ‌రో బంఫ‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోలుగా  ఓ ఫాంటసీ డ్రామా చిత్రం రూపొందుతోంది.  త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న వినోధయ సీతమ్  ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ముద్ర‌ఖ‌ని తెలుగు వెర్ష‌న్ ను డైరెక్ష‌న్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. త‌న బాధ్య‌త‌లను నెరవేర్చకుండానే చ‌నిపోయిన ఓ మ‌ధ్య‌వ‌య‌స్కుడి క‌థ ఇది.

తిరిగి బ‌తికే ఛాన్స్ వ‌స్తే ఏం చేశాడ‌నే పాయింట్‌కు వినోదాన్ని జోడిస్తూ రూపొందించారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇమేజ్‌కు తగినట్లుగా తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. కాగా ఈసినిమాలో కథానాయికగా పెళ్లి సంద‌డి భామ శ్రీలీల‌ను ఎంపిక‌చేసిన‌ట్లు తెలిసింది.ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు జోడీగా ఆమె నటించనున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

gorgeous Poonam Bajwa Latest Photoshoot Stills!

Anil Ravipudi Opens Up On His Fight With Tamannaah!