[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్టై[/qodef_dropcaps] లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురంలో’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ డైరెక్టర్స్ అందరికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు బన్నీ..అయితే ఈ పార్టీకి ముగ్గురు టాప్ డైరెక్టర్స్ రాకపోవడం విశేషం. యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీళ్లిద్దరూ ఈ పార్టీకి రాకపోయినా ఎవ్వరూ పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు..
కానీ, ఒక డైరెక్టర్ రాకపోవడంతో దానికి కారణం ఏమై ఉంటుందబ్బా అని ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు . ఇంకా అసలు విషయం లోకి వెళ్తే, ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి బన్నీ ఇచ్చిన పార్టీకి రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ మారింది.. గత మూడు వారాలుగా తమ సినిమా రికార్డుల గురించి ఒకరిని మించి ఒకరు ప్రకటనలు చేస్తూ వచ్చారు.. మా సినిమా ఇండస్ట్రీ హిట్ అంటే కాదు మా సినిమానే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్స్ తో తెగ హల్చల్ చేసారు, దింతో వీరి మధ్య కోల్డ్ వార్ ఏదో నడుస్తుంది అందుకే రావిపూడి బన్నీ పార్టీ కి డుమ్మా కొట్టాడు అని ప్రచారం జోరుగా సాగుతుంది.. మరి డైరెక్టర్ రావిపూడి కావాలనే పార్టీకి రాలేదా లేక బన్నీ అతన్ని పిలువలేదా రీసన్ ఏంటో తెలియాల్సి ఉంది.