ఓ సారి తాను సౌందర్యతో షూటింగ్‌లో ఉన్న సమయంలో ఆమెను ఎక్స్‌పోజింగ్ గురించి అడిగానని ఆమని చెప్పింది. అప్పుడు సౌందర్య స్పందిస్తూ, ఎక్స్‌పోజ్ ఎందుకు చేయాలని తిరిగి ప్రశ్నించిందని, రేపు పెళ్లయ్యాక భర్త పక్కన ఉన్నప్పుడు మన సినిమాలు చూస్తుంటే, అలాంటి సీన్లు వస్తే కనుక ఎలా ఫీలవుతామని అడిగింది. అలాగే, మన కుటుంబ సభ్యులకు ఆ సీన్లు ఎలా అనిపిస్తాయని సౌందర్య ప్రశ్నించిందని ఆమని గుర్తుచేసుకుంది.
ఇప్పుడు డబ్బుల కోసం ఇలాగే ఎక్స్‌పోజింగ్ చేస్తే, రేపు కుటుంబ సభ్యుల ముందు ఇబ్బందులు పడతామని సౌందర్య వివరించినట్టు ఆమని పేర్కొంది. ఇదిలావుంచితే, జగపతిబాబుతో శుభలగ్నం, మావిడాకులు వంటి సినిమాలతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమని ఇప్పుడు తల్లి పాత్రల్లోనూ నటిస్తోంది. కొత్త సినిమా ‘చావు కబురు చల్లగా’లో కీలక పాత్రలో నటించింది.