in

Mollywood star to play Mahesh Babu’s father in ‘Sarkaru Vaari Paata’!

భాగ‌మ‌తి, అల వైకుంఠ పురంలో..చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు మ‌ల‌యాళం యాక్ట‌ర్ జ‌య‌రామ్. ఈ రెండు సినిమాల్లో జ‌య‌రామ్ పోషించిన పాత్ర‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ యాక్ట‌ర్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న రాధేశ్యామ్‌లో కీ రోల్ చేస్తున్నాడు. జ‌య‌రామ్ ఇపుడు మరో టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌హేశ్‌బాబు న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట‌లో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే మ‌హేశ్ తండ్రి క‌మ్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా జ‌య‌రామ్ న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. బ్యాంకు కుంభ‌కోణాలు, ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్ లో సాగనుండ‌గా..త్వ‌ర‌లో జ‌య‌రామ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. ప‌ర‌శురాం డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న స‌ర్కారు వారి పాట‌లో కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Fan asks Janhvi Kapoor for a ‘kiss’ during her ‘Ask away’ session!

amani reveals Reason Behind Soundarya Not Exposed In Movies!