in

Allari Naresh joins Nagarjuna in Naa Saami Ranga?

నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘నా సామిరంగ’. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సినిమా గ్లింప్స్ లో నాగార్జున అల్ట్రా మాస్ గెటప్ లో అలరించారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాక్ టాలీవుడ్ లో రౌండ్ అవుతోంది. సినిమాలో మరో టాలీవుడ్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కామెడీ టైమింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్.

కొన్నేళ్లుగా ఆయన ట్రాక్ మార్చి నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈక్రమంలో నా సామిరంగ సినిమాలో మరో హీరోగా అల్లరి నరేశ్ నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లరి నరేశ్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.ఇటివల తాను నాగార్జున సినిమాలో అవకాశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మలయాళ హిట్ సినిమా పోరింజు మరియం జోస్ కు ఇది రీమేక్ అని..ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది..!!

kriti sanon taking special care about her sister Nupur!

telugu star hero doesn’t want anasuya in his film!