అందాల నటుడు శోభన్ బాబు గారు, క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరు, స్వచ్చందంగా నటన నుంచి విరమణ ప్రకటించిన ఏకైక నటుడు. ఎటువంటి వ్యసనాలు లేని నటుడు, కానీ ఆయనకు ఒకే ఒక అలవాటు ఉండేది, ఉదయం షూటింగ్ కు బయలుదేరేప్పుడు ఒక మంచి కాఫీ తాగి బయలుదేరటం,ఈ అలవాటు దాదాపు 45 సంవత్సరాలు కొనసాగించారు, కానీ అటువంటి అలవాటును కూడా ఒకానొక సందర్భం లో మానుకోవాల్సి వచ్చింది. ఆయన” ఏవండీ ఆవిడా వచ్చింది” అనే సినిమా లో నటిస్తున్నప్పుడు ఒక రోజు అయన బయలుదేరే టైం కి ఎవరు కాఫీ ఇవ్వలేదట, అలాగే షూటింగ్ కి వెళ్లిపోయారు, రెండో రోజు కూడా లాగే జరిగింది, కారణం అయితే తెలియదు, కానీ ఆ సంఘటన శోభన్ బాబు గారి లో ఒక ఆలోచన కలుగ చేసింది, రెండు రోజులు కాఫీ తాగకుండా ఉండగలిగాను కదా దీనిని యిలాగే కంటిన్యూ చేద్దామని, అంతే ఆ రోజు నుంచి కాఫీ కూడా మానేశారు. ఆ తరువాత ఒక సారి ఉదయాన్నే విమానం లో ప్రయాణం చేస్తున్నారు శోభన్ బాబు గారు, ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులందరికి కాఫీ సర్వ్ చేస్తుంది, విమానం అంత కాఫీ ఘుమ ఘుమ, అందరితో పాటు శోభన్ బాబు గారికి కూడా కాఫీ సర్వ్ చేసింది ఎయిర్ హోస్టెస్, ఆ కాఫీ ని చేతిలోకి తీసుకున్న శోభన్ బాబు గారు ఆ కాఫీ ని ముక్కు దగ్గర పెట్టుకొని ఆ కమ్మటి వాసనను గుండెల నిండా పీల్చుకొని, కాఫీ ని ప్రక్కన పెట్టేశారట, ఓ మై గాడ్ ,ఎంత స్వయం నియంత్రణ ఉందొ చూడండి. అంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన నటుడు అకాల మరణం చెందటం దురదృష్టకరం.అయన జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకం.,
Forgot password?
Enter your account data and we will send you a link to reset your password.
Your password reset link appears to be invalid or expired.
Log in
Privacy Policy
To use social login you have to agree with the storage and handling of your data by this website.
AcceptAdd to Collection
No Collections
Here you'll find all collections you've created before.