in

actress Urvashi Rautela gets injured on the sets of NBK109!

తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన ఊర్వశీ మొదటిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబో మూవీలో ఒక కీలక పాత్రలో ఊర్వశీ కనిపిస్తోంది. ఈ మూవీ దసరా బరిలోకి రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే షూటింగ్ చకచకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌  హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఊర్వశి తో పాటు పలువురు ముఖ్య నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఊర్వశికి ప్రమాద జరిగినట్లు, ఆ ప్రమాదం లో కాలికి గాయాలు అయ్యాయని టాక్.

వెంటనే అలర్ట్ అయిన చిత్ర యూనిట్‌ ఆమెను హాస్పటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో ఊర్వశి కి కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అఫీషయల్ గా మూవీ టీమ్ నుంచి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కానీ బాలయ్య మూవీలో ఊర్వశి కి ప్రమాదం జరగటం, గాయ పడటం నిజమని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఊర్వశి ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇప్పటివరకు ఐటెం గాళ్ గా ముద్ర పడిన ఈ అమ్మడు మొదటిసారిగా హీరోయిన్ గా నటిస్తుంటే ఇలా జరిగిందేంటని వాపోతున్నారు..!!

Mahesh Babu’s wife Namrata Shirodkar to make her re entry?

KGF Beauty srinidhi shetty Into nani’s ’Hit’ Series!