రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మార్చి 23న అతి కొద్ది మంది అతిథుల మద్య వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తాప్పీ ప్రియుడు మథియాస్ బో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు.
2013లో తాప్సీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనిపై తాప్సీ కానీ, మథియాస్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి మరీ వీరి పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయో..!!