in

Jr NTR to host a grand talk show on OTT?

దేవర తరవాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.  నెక్స్ట్ యశ్ రాజ్ బ్యానర్ లో ఒక స్పై సినిమాలో కూడా సోలో హీరోగా కమిట్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పై ఉత్సాహంగా ఉన్న ఫాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ దొరికింది. ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ఎన్టీఆర్ ని తమ ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించమని అడిగినట్టు సమాచారం. ఇందుకోసం భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టు టాక్.

అంతే కాదు పార్ట్నర్ షిప్ కూడా ఆఫర్ చేసారని తెలుస్తుంది..ఎన్టీఆర్ నిర్ణయం ఏంటా అని అంతా ఎదురు చూస్తున్నారు..ఎన్టీఆర్ కి హోస్ట్ గా చేయటం కొత్త కాదు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి  కార్యక్రమాలకు హోస్ట్ గా చేసి ఫుల్ మార్క్స్ సంపాదించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి హోస్ట్ గా చేసే అవకాశం వచ్చింది. దీనితో ఎన్టీఆర్ రియాలిటీ షో కి హోస్ట్ వ్యవహరిస్తూ, బిజినెస్ మాన్ గా కూడా మారనున్నాడని ఫాన్స్, సన్నిహితులు సంతోష పడుతున్నారు..!!

Akshay Kumar In Prabhas – Sandeep Reddy Vanga’s Spirit?

actress Taapsee Pannu got married secretly?