తనకు ఎలాంటి అనారోగ్యం లేదని..హార్ట్ ఎటాక్ రాలేదని సినీనటి ఆమని స్పష్టం చేశారు. తాను నిక్షేపంగా, షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ‘హార్ట్ ఎటాక్’గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమని ముఖ్యపాత్రలో ‘అమ్మ దీవెన’ చిత్రం ఇటీవల విడుదలై మంచి ప్రసంశలు పొందుతుంది. అలాగే ఆమె నటించిన “బ్యాచిలర్, చావు కబురు చల్లగా”తోపాటు పలు చిత్రాలు క్లైమాక్స్ దశలో ఉన్నాయి. తన సెకండ్ ఇన్నింగ్ చాలా బిజీబిజీగా సాగిపోతున్న తరుణంలో ఇలాంటి పుకార్లు కాస్త గందరగోళానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు..