in

Krithi Shetty’s latest remuneration shocks producers!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ తప్పుడు వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఓ సినిమాలోనూ కృతిని ఎంపిక చేసారని తెలుస్తుంది. మరి కొంతమంది యంగ్ హీరోలు కూడా ఈ హీరోయినే కావాలని అంటున్నారట.

దాంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ పెంచేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం ఏకంగా అరకోటికి పైగానే పారితోషికం అందుకుంటుందని ఇండస్ట్రీలో టాక్. ఇక ఉప్పెన సినిమా హిట్ అయ్యి ఆతర్వాత కమిట్ అయినా సినిమాల్లో ఒక్క సినిమా అయినా సక్సెస్ అయితే కృతి కోటిరూపాయలవరకు అందుకున్న అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందేమో చూడాలి.

actress aamani gives clarity about her health issue!

Hema Malini To play The Role of Prabhas Mother in aadhipurush?