బిగ్‌బాస్ 4 తెలుగుతో హీరోయిన్ మోనాల్ పాపులర్ అయింది. ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిందో.. ఇక అప్పటినుండి టాస్కులకంటే కూడా తన అంద చందాలతోనే ఎక్కువగా అలరించింది. ముఖ్యంగా మోనాల్ ముందుగా అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం వల్లే అఖిల్, అభిజిత్ గొడవ పడ్డారు. ఈ సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ 4వ సీజన్లో ఎక్కవ ఎపిసోడ్లు ఈ ముగ్గురి మధ్యే జరిగింది. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్, మోనాల్‌ల మధ్య రిలేషన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. తాజాగా ఈ భామకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఊహించని షాక్ తగిలిందట. ఎయిర్‌పోర్ట్‌లో మోనాల్‌ను చూసి కొంత మంది అఖిల్ ఎలా ఉన్నాడని గట్టిగా అరిచారట. అలా కొంత మంది తనను చూసి అరవడంతో తాను ఎంతో ఇబ్బందిగా ఫీలైనట్టు చెప్పుకొచ్చింది. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాల్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.