in

Vijay Devarakonda roars in the first look of ‘Liger’!

స్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్.. యువ హీరో విజ‌య్ దేవర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూరీ క‌నెక్ట్స్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.  రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం  ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్. పూరి జగన్నాథ్- విజయ్ కాంబో కావడంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. తాజాగా చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ల‌య‌న్, టైగ‌ర్‌ల క్రాస్ బ్రీడ్ లైగ‌ర్ అంటూ చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స‌రికొత్త‌గా చూపించారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. క‌రోనా వ‌ల‌న ఆగిన చిత్ర షూటింగ్ మ‌ళ్ళీ మొద‌లైంది.

a big shock to monal at the airport!

set lo yevaru undakudadhani thegesi cheppina mahesh babu!