
SOURCE:-
Vidya Balan Joins Balakrishna-Koratala Film!,
As Posted on Website 123telugu
టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ఆసక్తికరమైన సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తుండగా, తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం లేదని, కేవలం గెస్ట్ రోల్లో మాత్రమే కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బాలకృష్ణతో కలిసి విద్యాబాలన్ ‘ఎన్టీఆర్ బయోపిక్’లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇక దర్శకుడు కొరటాల శివ సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఆయన ఎంచుకునే కథలతో పాటు వాటి నేపథ్యానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో ప్రతి కథకు ఓ బలమైన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా, కథ జరిగే ప్రాంతం, అక్కడి ప్రజల జీవనశైలి, సామాజిక పరిస్థితులను కూడా తన సినిమాల్లో సహజంగా చూపించడం కొరటాల శివ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో చేయబోయే సినిమాలో కూడా అలాంటి బలమైన నేపథ్యం ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఈ చిత్రంలో పెద్దపీట వేయనున్నారట. కథాంశం కూడా ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని విధంగా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో, కథ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది..
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ కథ, కుటుంబ భావోద్వేగాలు తోడైతే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రస్తుతం అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ సినిమాలో విద్యాబాలన్ పాత్రతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఇప్పటికే తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య, మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దాదా’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి ఒకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ సినిమాతో మాస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న బాలకృష్ణ, మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు..!!
ALSO READ — Radhika Apte Trolled Over Balakrishna’s Legend!
