
SOURCE:-
Jr NTR Teams Up With Anil Ravipudi for Next!
As NTR Posted on his TWITTER ACCOUNT
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఈ వార్తకు అధికారికంగా తెరపడింది. నవంబర్ 15, ఆదివారం రోజున జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి తమ కొత్త సినిమాను ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఎక్స్ X ఖాతాలో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిస్థాయి నవ్వుల విందును అందించబోతోందని చెబుతూ.. “This one’s going to be a laugh riot” అంటూ పోస్ట్ చేశారు.
అంతేకాకుండా #NTRxAnilRavipudi అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ పోస్టులో తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను కూడా ట్యాగ్ చేయడంతో సినిమా నిర్మాణానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటివరకు మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్ ఉన్న కథలతో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు కామెడీ ఎంటర్‌టైనర్లతో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి కలిసి పనిచేయడం విశేషంగా మారింది. ఇద్దరి సినిమా శైలులు భిన్నంగా ఉండటంతో ఈ కాంబినేషన్‌లో ఎలాంటి కథను ఎంచుకుంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను అనిల్ రావిపూడి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎలా చూపించబోతున్నారనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో #NTRxAnilRavipudi ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ కొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ తేదీ వంటి వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది..!!
ALSO READ — Radhika Apte Trolled Over Balakrishna’s Legend!

