
ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తాజాగా గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడిదారుడిగా మారాడు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘షాట్‌గన్ గేమ్స్’లో మహేశ్ వ్యూహాత్మక పెట్టుబడి పెట్టినట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పీసీ, కన్సోల్ గేమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది..
ఈ భాగస్వామ్యాన్ని షాట్‌గన్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా ధ్రువీకరించారు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూరప్, యూకే వంటి గ్లోబల్ మార్కెట్ల కోసం ‘టేక్‌డౌన్ జెనెసిస్’ పేరుతో ఒక యాక్షన్-అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ స్థాయి పీసీ, కన్సోల్ గేమ్స్‌ను భారత్ కూడా తయారు చేయగలదని నిరూపించడమే తమ లక్ష్యమని కంపెనీ వ్యవస్థాపకులు పేర్కొన్నారు..!!

