in

anjali gives humorous explanation about late marriage!

Keerthy Suresh’s Dorothy

అంజలి ప్రస్తుతం సినిమాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఐతే, అవకాశం వచ్చినప్పుడల్లా వ్యక్తిగతం, ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాల్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంది. ప్రస్తుతానికి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు ఏమాత్రం లేదని అంజలి క్లారిటీ ఇచ్చింది. ‘అసలు పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అయినా, నా జీవితం నా ఇష్టం. నా మనసుకు ఎప్పుడు సరైన సమయం అనిపిస్తే అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. అయినా, నా పెళ్లి విషయంలో చాలామందికి ఆసక్తి ఉన్నట్టు ఉంది..

నా పెళ్లి విషయంలో అందరికీ అంత ఆత్రుత, తొందర ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అంటూ అంజలి చెప్పుకొచ్చింది. అంజలి ఇంకా మాట్లాడుతూ..‘నిజానికి నా పెళ్లి గురించి నాకంటే నా ఫ్రెండ్స్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్. కారణం..వాళ్లకి ఈ వేడుకలంటే ఇష్టం కదా. చక్కగా కొత్త డ్రెస్సులు వేసుకుని ఫొటోషూట్‌లు తీయించుకోవచ్చు. రోజంతా సందడి చేయాలి. అదే వాళ్ళ ఆసక్తి. అయినా, వాళ్ల సరదాల కోసం, వాళ్లు ఎంజాయ్ చేయడానికి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి. నా ఎంజాయ్ కోసం నేను చేసుకోవాలి. ఆ సమయం ఇంకా రాలేదు’ అని అంజలి తెలిపింది. ప్రస్తుతం అంజలి తమిళంలో బిజీగా ఉంది..!!

Taapsee Pannu talks about her 13-year relationship with Mathias Boe!