in

Chiranjeevi is set to make his digital debut with netflix!

Keerthy Suresh’s Dorothy

తెలుగు చిత్రసీమలో దాదాపు 48 ఏళ్లుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు సరికొత్త బాటలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. వెండితెరపై తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన ఒక ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ సిరీస్ చేయబోతున్నారు..

తొలుత చిరంజీవి జీవిత ప్రస్థానంపై ఒక డాక్యుమెంటరీని రూపొందించాలని భావించినప్పటికీ, పాడ్‌కాస్ట్ అయితే తన భావాలను మరింత స్వేచ్ఛగా, నేరుగా పంచుకోవడానికి వీలుంటుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ వినూత్న ఆలోచనను ఆయన కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు ప్రముఖ రచయిత బీవీఎస్ రవి ప్రతిపాదించగా, చిరంజీవి వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే పలు విజయవంతమైన టాక్ షోలకు పనిచేసిన అనుభవం ఉన్న BVS రవి ఈ ప్రాజెక్టుకు రచన, రూపకల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.!!

NOBODY CAN STOP WHEN GOD PROPOSES!

Taapsee Pannu talks about her 13-year relationship with Mathias Boe!