in

mrunal thakur’s 4 years long-delayed film to release finally!

మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’. నవజ్యోతి గులాటీ, విషాషా అరవింద్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. నిజానికి ఈ మూవీ ఇప్పటిది కాదు. దాదాపు నాలుగేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. వివిధ కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు కూడా థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు.

ఈ మేరకు తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటనతో పాటు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. జీ5 వేదికగా అక్టోబర్ 2 నుంచి మృణాల్ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. “కొన్ని కథలు మీరు చూసే విషయాలనే అనుమానించేలా చేస్తాయి..మరికొన్ని మీరు నమ్మే విషయాలను ప్రశ్నించేలా చేస్తాయి. కానీ ఈ కథ మాత్రం వాటి మధ్యలో ఉన్న ప్రతి దానినీ ప్రశ్నిస్తుంది.” అంటూ మేకర్స్ ఇచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్ సినిమాపై అంచనాలను కూసింత పెంచింది. మృణాల్, హుమా కలిసి ఎలాంటి సస్పెన్స్ అందిస్తారో చూడాలి..!!

Kartikeya Gummakonda’s ‘comeback’ with directorial debut!

malayali Merin Philip earns 6 times more remuneration for telugu film!