in

we are “just good friends.” says anand d and vaishnavi chaitanya!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్యలు రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బేబి’తో పాటు ‘ఎపిక్’లో కలిసి నటించిన ఈ జోడీ రీల్ లైఫ్ కెమిస్ట్రీ చూసి, వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ డేటింగ్ రూమర్లపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన వైష్ణవి చైతన్య, తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని తేల్చి చెప్పింది. తామిద్దరం మంచి కో-స్టార్స్ మాత్రమే కాకుండా ఆత్మీయ స్నేహితులమని తెలిపింది. ఇదే సమయంలో ఆనంద్ దేవరకొండ పెళ్లి ప్రణాళికల గురించి మాట్లాడుతూ..రాబోయే మూడేళ్లలో వివాహం చేసుకుంటానని చెప్పాడు. అయితే తనకు మాత్రం ఇప్పట్లో వివాహం ఆలోచన లేదని, కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తానని వైష్ణవి స్పష్టం చేసింది..!!

Tharun Bhascker and Eesha Rebba Makes their relation Official

south crazy beauty Malavika Mohanan struggle continues!