in

Rashmika Mandanna To Play M S Subbulakshmi In Biopic!

భారతీయ సినిమా వద్ద దిగ్గజ గాయనీ గాయకుల్లో లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి కూడా ఒకరు. అయితే ఆమె జీవిత చరిత్రపై సినిమా ఉంటుంది అని కొన్నాళ్ల కితం నుంచి టాక్ ఉంది. మొదట నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తుంది అని టాక్ వచ్చింది. కానీ తర్వాత ఈ బిగ్ ఛాన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒడిసి పట్టింది అని ఎక్స్ క్లూజివ్ గా మేము తెలిపాము. ఇక ఫైనల్ గా దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇప్పుడు రానే వచ్చింది. రేపు సెప్టెంబర్ 16 ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి కావున చెన్నైలో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కావడం ఖాయం అయ్యింది. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఛీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. అలాగే మరింత మంది దిగ్గజ గాయనీ గాయకులు కూడా హాజరు కానున్నారు. ఇక ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు..!!

f cube ‘mamitha baiju’!

Tharun Bhascker and Eesha Rebba Makes their relation Official