in

Amitabh Bachchan says ‘retire’ meant going to bed not leaving films!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను ఇప్పట్లో నటన నుంచి రిటైర్ కావడం లేదని సోమవారం రాత్రి స్పష్టం చేశారు. తన బ్లాగ్‌ పోస్టుల కారణంగా మొదలైన ఈ ప్రచారానికి ఆయన తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. సోమవారం రాత్రి తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఈ విషయంపై అమితాబ్ స్పందించారు. “లేదు సర్, నేను పని నుంచి రిటైర్ అవ్వడం లేదు. నిద్రపోవడానికి వెళ్తున్నాను అని అర్థం!

అక్కడికి రావడానికి మీకు అనుమతి లేదు” అంటూ హిందీలో రాసిన పోస్ట్‌లో చమత్కరించారు. దీంతో తన రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు..కొన్ని రోజుల క్రితం అమితాబ్ తన బ్లాగ్‌లో ఒక పోస్ట్ రాస్తూ చివర్లో “అండ్ ఐ రిటైర్” (నేను రిటైర్ అవుతున్నాను) అని ముగించారు. ఆ పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అమితాబ్ నటనకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా ఈ వివరణ ఇచ్చారు. ‘రిటైర్’ అంటే పడుకోవడానికి వెళ్లడమేనని, వృత్తిపరమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదని స్పష్టం చేశారు..!!

happy birthday ramya krishna!

f cube ‘mamitha baiju’!