
ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటి మమితా బైజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని, అందుకే ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ పంచుకోనని స్పష్టం చేశారు. తన సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు పీఆర్ టీమ్ ద్వారానే వెల్లడవుతాయని తెలిపారు..
ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలతో పాటు పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమానినని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూస్తానని చెప్పారు. ముఖ్యంగా ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో ఆయన ధరించిన క్యాసియో వాచ్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ స్టైల్‌ను తాను కూడా కాపీ కొట్టేదాన్నని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమితా తండ్రి డాక్టర్ కాగా, ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు..!!

