in

keerthy suresh demands high for doing a special song!

టాలీవుడ్ హిట్ పెయిర్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది. ‘నేను లోకల్’, ‘దసరా’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ జంట మరోసారి ఒకే తెరపై కనిపించబోతోంది. అయితే ఈసారి పూర్తిస్థాయి పాత్రలో కాకుండా, నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక పాట చిత్రీకరణ కోసం కీర్తి సురేష్ కేవలం రెండు రోజుల కాల్‌షీట్లు మాత్రమే కేటాయించినట్లు టాక్ నడుస్తోంది..

అయితే, కేవలం ఈ రెండు రోజుల షూటింగ్ కోసం ఆమె అందుకోబోతున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఖచ్చితమైన మొత్తం బయటకు రానప్పటికీ, ఆమెకు భారీ స్థాయిలో పారితోషికం చెల్లిస్తున్నారని వార్తలు వస్తుండటంతో కీర్తికి ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల ఈ స్పెషల్ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా, ఇంటెన్స్‌గా ప్లాన్ చేస్తున్నారట. ‘దసరా’ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటం, అందులోనూ ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిస్తుండటంతో ఈ మాస్ నంబర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

GREAT ACTORS WITH GOLDEN HEART!

Rashmika Mandanna suffers hip injury on film set!