in

has Pooja Hegde Agreed To Arrange Marriage?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కొత్త సినిమా లేదా గ్లామరస్ ఫోటోషూట్ వల్ల కాదు, తన పెళ్లి వార్తలతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. త్వరలోనే పూజా హెగ్డే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కెరీర్ పరంగా కాస్త నెమ్మదించిన ఈ తరుణంలో ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది..

తాజా సమాచారం ప్రకారం, ఇది ప్రేమ వివాహం కాదని, కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికే పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ పరిశ్రమకు చెందిన వారా లేక వ్యాపారవేత్తా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ, పూజా హెగ్డే గానీ, ఆమె ప్రతినిధులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ ప్రచారంలో నిజమెంత ఉందనేది తేలాల్సి ఉంది. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..!!

Kajal Aggarwal learned the power of saying no!

GREAT ACTORS WITH GOLDEN HEART!